మలేషియాలో శ్రీకాంత్-ఛార్మీ!
Publish: Wed, 16 Jul 2008 (14:04 IST)
Updated: Wed, 16 Jul 2008 (14:03 IST)
శ్రీకాంత్-ఛార్మీలు మలేషియాలో ఉన్నారటండీ.. ఎందుకో తెలుసా? "కౌసల్యా సుప్రజా రామ" షూటింగ్ కోసం. కౌసల్యా.. సినీ యూనిట్ పాటల చిత్రీకరణ మలేషియాకు చేరుకుంది. ఇందులో భాగంగా హీరో శ్రీకాంత్, ఛార్మీ మరియు గౌరీ ముంజల్‌పై కొన్ని పాటలను మలేషియాలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు యూనిట్ వెల్లడించింది. త్రికోణ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆడియో నెలాఖరులో రిలీజ్ కానుంది. డి. రామానాయుడు నిర్మాత సారథ్యం వహించే ఈ చిత్రానికి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నెల మధ్యలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.