"మహారధి" నిర్మాత క్షమాపణ!
|
ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన గురుకిరణ్ కూడా తన స్పందనను తెలియజేస్తూ... యూదృశ్చికంగా ఆ చరణానికి ఆధునిక తరహాలో ట్యూన్ కట్టాననీ, దీనివల్ల హిందువుల మనస్సునొప్పిస్తే క్షమించాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రంపై కేసు ఏడాదిన్నర క్రితం వేశామనీ, ఇప్పటికి ఓ కొలిక్కివచ్చిందని హైదరాబాద్ సిటీ భజరంగ్‌దళ్ అధ్యక్షుడు తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మతానికి సంబంధించి నెగటివ్ సందేశాలు ఇచ్చే ఇటువంటి చిత్రాలను నిర్మించే చిత్రపరిశ్రమకు హెచ్చరికగానే ఈ కేసు వేశామని చెప్పారు.
ఇకపై ఇటువంటివి పునరావృతం కాకూడదని, కేసు వేయడమనేది ఇదే ప్రథమమని, అంతిమమని ఘాటుగా స్పందించారు. అటు చిత్ర నిర్మాతకు, ఇటు భజరంగ్‌దళ్‌కు సంధానకర్తగా కేసును సానుకూలంగా పరిరక్షించే దిశగా "రక్ష" అధ్యక్షుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు వ్యవహరించారు. ఇకనుంచి ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగువిధంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా ఆయన సెన్సార్ బోర్డుకు సూచించారు.