"రాజా" హీరోగా ముంబై భామ తీర్థను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ శ్రవ్య ఫిలింస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ షూంటింగ్ ప్రారంభించి సెప్టెంబర్‌లో కల్లా సినిమాను పూర్తిచేస్తామని చిత్ర నిర్మాతలు కె. బసిరెడ్డి, వై. రవీంద్రబాబు చెప్పారు.
నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదలకు సిద్దంచేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రవీంద్ర బాబు అన్నారు. చిత్రదర్శకుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ, ఈ ఏడాది వచ్చిన చిత్రాలలో తమదే ఉత్తమ చిత్రంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. చక్కని కథకు సరియైన ఆర్టీస్టులు తోడయ్యారని, చూపులో అమాయకత్వం ఉట్టిపడే పాత్రగా రాజాను ఎంపిక చేశామన్నారు.
అదే తరహాలో ఉన్న ముంబైకు చెందిన తీర్థను ఎంపిక చేశామని తెలిపారు. ఇక స్క్రిప్ట్ పరంగా ఎల్.బి. శ్రీరామ్, నాగరాజు తుదిమెరుగులు దిద్దారన్నారు. ఇంతవరకు రాని చక్కని పాయింట్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమై అర్బన్ నేపథ్యంతో ముగిసేకథని వెల్లడించారు.
ఈ సందర్భంగా తనికెళ్లభరణి మాట్లాడుతూ... ఇంతవరకు నటించని విభిన్న పాత్రలో రాజా, ఎల్.బి. శ్రీరామ్ పోషిస్తున్నారని, ఇందులో తనది రొటిన్ వేషమేనని చెప్పారు. అయితే నటనలో కొత్తదనం చూపే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.
సంగీత దర్శకుడు సాకేత్‌సాయిరామ్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాలుగు పాటలులుంటాయని, త్వరలో బాణీలు సమకూరుస్తానన్నారు. నటుడు రాజా మాట్లాడుతూ... ఇందులో పోషిస్తున్న పాత్ర తనకు గుర్తింపు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాత్ర పలు విమర్శలకు దారితీయవచ్చునని, కమల్‌హాసన్, రాజేంద్ర ప్రసాద్ వంటివారు పోషించిన వైవిధ్యమైన పాత్రల తరహాలో చేస్తున్న ప్రయత్నమన్నారు.
తన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రని, నంది అవార్డు గ్రహీత సునీల్ కుమార్ దర్శకత్వంలో చేయటం ఆనందంగా ఉందని తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో జీవా, జయప్రకాష్ రెడ్డి, శ్వేత తదితరులు నటించనున్నారు. కెమెరా... సాయిజేమ్స్, స్ర్కిప్ట్...గందం నాగరాజు, స్క్రీ న్ ప్లే, దర్శకత్వం... పి. సునీల్‌కుమార్ రెడ్డి.
|