ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రజనీ సుల్తాన్‌లో ఇలియానా!  Search similar articles
WD
తమిళ సూపర్ స్టార్ నటించే 2డి యానిమేషన్ సినిమా "సుల్తాన్ ది వారియర్"లో అందాల ముద్దుగుమ్మ ఇలియాననటిస్తోంది. దీనితో యానిమేషన్ చిత్రంలో నటించే తొలి భారతీయ హీరోయిన్‌‌గా అమ్ముడు పేరు సంపాదించుకోనుంది. సుల్తాన్‌లో ఇలియానా ఫుల్‌ఫెడ్జ్‌డ్ 2డి యానిమేషన్ పాత్రను పోషించనుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

రజనీ కాంత్ కుమార్తె సౌందర్య రజనీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న "సుల్తాన్ ది వారియర్" రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోనుంది. ఇకపోతే "సుల్తాన్" సినిమా షూటింగ్‌లో భాగంగా.. ఆగస్టులో రజనీ కాంత్, ఇలియానాలపై కొన్ని సన్నివేశాల చిత్రీకరణ భాగ్యనగరంలో జరుగనుంది.

వీరిరువురిపై చిత్రీకరించనున్న సన్నివేశాలు అనంతరం 2డి ఫార్మెట్‌లో కన్వర్ట్ అవుతాయని చిత్ర యూనిట్ పేర్కొంది. అంతేకాకుండా సుల్తాన్‌లోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం సుల్తాన్ వారియర్ చిత్ర యూనిట్ విదేశాలకు చేరుకోనుంది.
మరిన్ని
శ్రవ్య ఫిలింస్‌ పతాకంపై "రాజా" కొత్త చిత్రం
వరుణహోమం నిర్వహించిన సినీ ప్రముఖులు  
లగడపాటి 'స్నేహగీతం'
టాలీవుడ్ పరిశ్రమకు సెన్సార్ నిబంధనల వాత
వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన గోపిక!
"గీతం" ఆల్బమ్ విడుదల