1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

స్ట్రగుల్‌కు హరేరామ్ ఫుల్‌స్టాప్ : కళ్యాణ్

స్ట్రగుల్‌కు హరేరామ్ ఫుల్‌స్టాప్ : కళ్యాణ్
WD
నటునిగా తాను పడుతున్న స్ట్రగుల్‌కు "హరేరామ్" చిత్రం ఫుల్‌స్టాప్ పెటిందని చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్‌రామ్ అభిప్రాయ పడ్డారు. తాతగారి పేరుమీదుగా నందమూరి తారక రామారావు బేనర్‌ను స్థాపించి, తామే నిర్మాత వహించి తీసిన తొలిచిత్రం హరేరామ్. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి కళ్యాణ్‌రామ్ సంస్థ కార్యాలయంలో శనివారంనాడు విలేకరులతో మాట్లడుతూ... మంచి కథను ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంటర్‌వెల్‌ సీన్‌లో ఉన్న మలుపును ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. ఈ కథలో కొత్తదనం ఉట్టిపడిందని, సినిమా అంటే ఎంటర్‌టైన్‌‍మెంటే కాకుండా ఈ చిత్రంలో సామాజిక సమస్యనుకూడా చిత్రించామన్నారు. బ్రహ్మానందం కామేడీని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారని, ప్రియామణి పాత్ర పరంగా చక్కగా నటించిందని పేర్కొన్నారు.

బేనర్ గురించి చెబుతూ... తాతగారి పేరుతో పెట్టిన బేనర్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదని, గొప్ప చిత్రాన్ని తీయాలనే ప్రయత్నంలో ప్రేక్షకులకు నచ్చని సినిమా మాత్రం తీయలేదని చెప్పారు. ఈ బేనర్‌లో సినిమా తీసినందుకు ఆంధ్రా ప్రజలు ఆదరించి తమను కాపాడారని, నిర్మాతగా "అతనొక్కడే" చిత్రానికి ఉన్న టెన్షన్ ఈ సినిమాలో లేదన్నారు.

ఓపెనింగ్స్ బాగా వచ్చాయని, విడుదలైన అన్ని చోట్ల చాలా బాగుందనే వార్తలు రావడం తమకు అందడం ఆనందంగా ఉందన్నారు. హర్షవర్ధన్ చక్కని స్క్రీన్‌ప్లే చేశారని, తెలుగులోనే బిగ్గెస్ట్ స్క్రీన్‌ప్లే చిత్రం ఇదేనన్నారు. ఈ చిత్రంలోని ప్రత్యేక ట్విస్ట్‌లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని, మిక్సీజెమేయర్ సందర్భానుసరంగా సమకూర్చిన బాణీలు బాగున్నాయని తెలిపారు.
About Writer
Harsha Vardhan