శ్రీహరి ప్రధాన పాత్రలో "సరోజ"
అమ్మా క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మిస్తున్న చిత్రానికి "సరోజ" అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. డా.శ్రీహరి ప్రధాన పాత్రలో వైభవ్, ఎస్.పి చరణ్, ప్రకాష్ రాజ్, కాజల్, నిఖిత తదితరులు నటిస్తున్నారని చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా వెంకట్ ప్రభు మాట్లాడుతూ... స్ట్రీట్ క్రికెట్ నేపథ్యంలో తాము దర్శకత్వం చేసిన "చెన్నై -600028"కు చేరణ్ నిర్మాత బాధ్యతను వహించారని, ఆయనే ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. ఒక్క రోజులో జరిగే కథని, స్ర్కీన్‌ప్లేకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కథను ఓ చోటున ముడిపెట్టి కథ నడుస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో శ్రీహరి వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని, ఆయన బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా స్ర్కిప్ట్‌తో మార్పుచేసి తెలుగులో యాక్షన్ ఎపిసోడ్స్ పెంచామన్నారు. ఇటీవలే చెన్నైలో ఎ.ఆర్.రెహమాన్ తమిళంలో ఆడియోను విడుదల చేశారని, త్వరలో తెలుగులో కూడా ఆడియోను, సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.
శ్రీ హరి మాట్లాడుతూ... దర్శకుడు కథను చెప్పున్నప్పుడే సినిమాను కళ్ళకు కట్టినట్టు చెప్పాడని, తీస్తే ఇతనే చేయగలడనిపించిందని చెప్పారు. మొన్ననే నిమిషం పాటు యాడ్ కూడా తయారుచేసి చూపించాడన్నారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న ఈ యాడ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందన్నారు. కొత్త సినిమాపై మోగ్గుచూపే ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం తనకుందన్నారు.
వైభవ్ మాట్లాడుతూ... తామూ ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించామన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమం ముగిసిందనీ, సాంకేతికంగా ఉన్నత విలువలు కల చిత్రమిదన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...యువన్‌శంకర్‌రాజా చక్కని సంగీతాన్ని పండించారనీ, ఈ చిత్రంలో టీవీ ఆర్టిస్టులంతా పాల్గొన్న ఓ పాట హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. నలుగు స్నేహితుల్లో ఒకడు టీవీ ఆర్టిస్టని, ఆయన ఎంగేజ్‌మెంట్‌కు వారంతా హాజరవుతారని వెల్లడించారు. అందులో రాధిక కూడా ఉన్నారన్నారు. త్వరలో ఆడియోను విడుదల చేసి, ఒకేసారిగా తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదలచేస్తామన్నారు. కొత్త తరహాలో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని సంభాషణ రచయిత వెన్నెలకంటి పేర్కొన్నారు.