వై.ఎస్సార్ నటన అద్భుతం : సి.సి.రెడ్డి
వైఎస్ ముఖ్యపాత్రధారిగా, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారిగా నటిస్తోన్న కొత్త చిత్రం తొలిషెడ్యూల్ పూర్తయింది. చిత్ర సమర్పకుడు సి. సి. రెడ్డి మాట్లాడుతూ... సీనియర్ నటులకు తీసిపోనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నటించి తమ పాత్రకు, చిత్రానికి నిండుదనాన్ని చేకూర్చారని విసుఫిలింస్ ప్రైవేట్‌లిమిటెడ్ అధినేత సి.సి.రెడ్డి తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించి పదిరోజుల్లో 30 శాతం షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెండురోజుల పాటు జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలను తెలిపారు. పుష్పకవిమానం చిత్రం తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ మూవీ తమదేనన్నారు. కాగా ఆగస్టు మొదటి నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని సి.సి.రెడ్డి తెలిపారు.
చిత్రదర్శకుడు అరుణ్‌ప్రసాద్ మాట్లాడుతూ... ఈ సినిమాకి రీ-రికార్డింగ్ ప్రాణమని, ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారని, హాస్య పాత్రలో బ్రహ్మానందం హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించగలదన్నారు. సినిమాలో చివరి సెంటిమెంట్ ప్రేక్షకుల మనస్సును హత్తుకుంటుందని తెలిపారు. త్వరలో ఈ సినిమాకి టైటిల్‌ను వెల్లడిస్తామన్నారు.