నవనీత్‌కౌర్ ప్రధాన ప్రాతధారిణిగా నటిస్తోన్న చిత్రం "కాలచక్రం". ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకుంటోంది. ఈ చిత్రం గురించి నిర్మాతలు ఎన్. గోవింద్, ఎన్.అనిల్ మాట్లాడుతూ... ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేశామనీ, డబ్బింగ్ కూడా ముగించుకుని ఫైనల్‌మిక్సింగ్ జరుపుకుంటోందన్నారు. ఈ నెలాఖరిలో ఆడియోను విడుదల చేసి, ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చిత్ర దర్శకుడు విక్రమ్ శివాజీ మాట్లాడుతూ... ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనీ, ఇందులో ప్రేతాత్మల ప్రస్తావనకూడా ఉందన్నారు. నవనీత్‌కౌర్ పెరఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కలిగించిందని చెప్పారు. యాంటీ హీరోగా వినోద్‌కుమార్, హీరోగా బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో హరిప్రసాద్, కవిత-నవనీత్‌కౌర్ తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రీరికార్డింగ్ ప్లస్ అవుతుందన్నారు.
నవనీత్ కౌర్ మాట్లాడుతూ... తామింతవరకు నటించనటువంటి వైవిధ్యభరితమైన పాత్రలో నటిస్తున్నాననీ, ఈ చిత్రం ద్వారా నటిగా తమకు గుర్తింపు లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇంకా ఈ చిత్రంలో హేమసుందర్, తిరుపతి ప్రకాష్, అభినయశ్రీ, అపూర్వ, కళ్ళు చిదంబరం, కవితా పట్నాయక్, వాహిని తదితరులు నటిస్తున్నారు. సంగీతం... భూపతి పూర్ణ, కెమెరా... వీణాఆనంద్, సమర్పణ... నిశ్శంకరరావు రమాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు,దర్శకత్వం...విక్రమ్ శివాజీ.
|