1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

25న "సిద్దు ఫ్రమ్ సికాకుళం" ఆడియో

25న
WD
అల్లరి నరేష్, మంజరి, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లుగా, ఈశ్వర్ దర్శకత్వంలో వెలోఫేర్ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం "సిద్దు ఫ్రమ్ సికాకుళం". ఇటీవలే బ్యాంకాక్ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని చిత్రయూనిట్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా నిర్మాత మల్లా విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నరేష్, శ్రద్ధాదాస్‌పై భూపాల్ రాసిన "నా... నబాబా.. అనే పాటలను పుకెట్‌లో "కహోన ప్యార్‌ హై" తీసిన ప్రాంతంలో అద్భుతంగా తెరకెక్కించామని చెప్పారు.

వనమాలి రాసిన "జాంపండు లాంటి పిల్ల.." అనే పాటను నరేష్, మంజరిలపై పటాయ్‌లో చిత్రీకరించామని అన్నారు. ఈ రెండు పాటలకు భాస్కర్ కొరియోగ్రఫీ వహించారు. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 25 వైజాగ్‌లో సుప్రీంద్వారా విడుదల కానుంది. అన్ని కార్యక్రమాలు ముగించి ఆగస్టు 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని విజయ్ ప్రసాద్ అన్నారు.
About Writer
Selvi