ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింహాచలంలో "చింతకాయల రవి"  Search similar articles
WD
విక్టరీ వెంకటేష్, అనుష్క, ఛార్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "చింతకాయల రవి". ప్రస్తుతం ఈ సినిమా సింహాచలం నరసింహస్వామి ఆలయంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ శని, ఆదివారం వరకు సింహాచలంతో పాటు వైజాగ్ ప్రాంతాల్లోనూ షూటింగ్ జరుపుకోనుంది.

నరసింహస్వామి ఆలయంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోందని దర్శకుడు యోగి వెల్లడించారు. చిత్రీకరణకు సంబంధించిన అనుమతులను ఆలయ నిర్వాహకం వద్ద ఇప్పటికే పొందామని ఆయన అన్నారు.

రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబరులో "చింతకాయల రవి"ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యోగి తెలిపారు. ఇకపోతే 'లక్ష్మీ' ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి ఈ సినిమాకు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు.
మరిన్ని
అల్లు అరవింద్ చేతులమీదుగా "బాబ్జీ" ఆడియో
28న భూమిక "మల్లెపూవు" ఆడియో రిలీజ్
దిల్‌రాజు నిర్మాణంలో "కొత్త బంగారులోకం"
25న "సిద్దు ఫ్రమ్ సికాకుళం" ఆడియో
తపన్ సిన్హాకు ఫాల్కే పురస్కారం!
సస్పెన్స్ థ్రిల్లర్‌గా "కాలచక్రం"