1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

టాకీ పూర్తి చేసుకున్న "కాశీపట్నం..."

వెండితెర కథనాలు టాకీ పూర్తి కాశీపట్నం విజయ్ ఆనంద్ హీరో సుప్రేన హీరోయిన్‌
విజయ్ ఆనంద్ హీరోగా, సుప్రేన హీరోయిన్‌గా "కాశీపట్నం చూడర బాబూ" సినిమా టాకీ పూర్తి చేసుకుంది. ప్రముఖ దర్శకుడు మద్దిరాల డైరక్షన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రేమకథానేపథ్యంలో, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ఎం.ఎన్.ఎం వివరాలందజేస్తూ... ఈ సినిమాలో ఐదు పాటలున్నాయని, అందులో మూడు పాటలను వివిధ లొకేషన్లలో చిత్రీకరిస్తున్నామని అన్నారు.

ఇందులో భాగంగా జూలై 25వ తేదీ నుంచి వరుసగా 11 రోజులు బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. కృష్ణారెడ్డి కొరియోగ్రాఫింగ్‌లో పాటల సన్నివేశాలు చక్కగా కుదిరాయని ఎం.ఎన్.ఎం చెప్పారు. మరో రెండు పాటలకు ఆగస్టు పదోతేదీ నుంచి నిక్సన్ కొరియోగ్రాఫీ అందించనున్నారని అన్నారు.

కృష్ణభగవాన్, వేణుమాధవ్, కొండవలస, జైప్రకాష్ రెడ్డి, సూర్య, ధర్మవరపు, సుబ్రహ్మణ్యం, గీతాసింగ్, జయలలిత తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు... మోహన్, సంగీతం.. చక్రి, ఆర్ట్... కృష్ణ మాయ, ఎడిటింగ్... బసవ పైడిరెడ్డి, కెమెరా.. ఎం.ఎన్. జవహర్ రెడ్డి.
About Writer
Selvi