1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మాఫియా నేపథ్యంలో "అంకుశం"

వెండితెర కథనాలు మాఫియా నేపథ్యం అంకుశం విజయ్‌కుమార్‌ రెడ్డి స్వీయ దర్శకత్వం
WD
విజయ్‌కుమార్‌ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం "అంకుశం". కొందరు పోలీసుల అండదండలతో అమ్మాయిలతో చీకటి వ్యాపారం సాగించే మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపోందుతోంది. ప్రస్తుతం అంకుశం షూటింగ్ ముగించుకుని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... అలనాటి "అంకుశం"ను మైమరపించే రీతిలో ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలోని కథ మాఫియా చుట్టూ పరిభ్రమిస్తుంటుందని, వైజాగ్ తీరంలో ఓ మాఫియా చీకటి వ్యాపారం సాగిస్తుందన్నారు.

చిత్ర హింసలకు గురైన అరడజను అమ్మాయిల్ని డ్రైనేజీలో పడదోస్తే ముగ్గురు చనిపోగా మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరుతారని చెప్పారు. వారిచ్చిన క్లూ ఆధారంగా బహిర్గతమైన మాఫియా కార్యకలాపాలకు ఎలాంటి ముంగింపు ఉంటుందనే ఆసక్తికర అంశమన్నారు. జులాయిలాగా తిరిగే శ్రీనాథ్, పోలీస్ ఇన్స్‌‌స్పెక్టర్ రితీష్ పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. ఈ చిత్రంలోని సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్తేజితుల్నిచేస్తుందని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో కీర్తీచావ్లా, అనిత, జయప్రకాష్‌రెడ్డి, మల్లిఖార్జునరావు, శ్రీమాన్, తెలంగాణా శకుంతల తదితరులు నటించారు. సంగీతం... మరియమనోహర్, పాటలు...సాహితి, కెమెరా...అబూషా, అమర్.
About Writer
Harsha Vardhan