మూడో షెడ్యూల్ పూర్తిచేసుకున్న "పోలీస్ పోలీస్"
|
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటివరకు పోలీస్ కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయని, అందులో తమ సినిమా వైవిధ్యంగా నిలుస్తుందన్నారు. ఈ చిత్రంలో కమలిని ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోందని, స్క్రీన్ ప్లే ముఖ్యాంశంగా తెరకెక్కనుందని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ... ఈ సినిమా నాల్గో షెడ్యూల్ ఆగస్టు తొలివారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం... చక్రి, కెమెరా... భరణి కె. ధరన్, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం.... మన్‌మోహన్.