మూఢనమ్మకాల నుంచి "రక్ష"ణ
|
రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమంలో ఉందన్నారు. ఆగస్టు మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలో కళ్యాణి, జయసుధ, రాజీవ్ కనకాల, జీవా, సుబ్బరాజు, రాధాకుమారి, బేబీ నేహ, మాస్టర్ అతుల్, ప్రదీప్ రావత్, చంద్రశేఖర్, భార్గవి, నర్సింగ్ యాదవ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం... బాపితులత్, కెమెరా... సర్జోదీప్, ఎడిటింగ్... భానోదయ, ఆర్ట్... మురళీధర్, డైలాగ్స్... జీవన్‌రెడ్డి.