1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నమిత "జగన్మోహిని" సినిమా షూటింగ్ ప్రారంభం

నమిత
WD
అలనాడు విఠలాచార్య దర్శకత్వంలో "జగన్మోహిని" జయమాలిని పోషించిన పాత్రను ప్రస్తుతం నమిత పోషిస్తోంది. మురళీ సినీ ఆర్ట్స్ పతాకంపై హెచ్. మురళి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం తమిళ వర్షన్ కొంత భాగాన్ని ఇటీవలే మధురైలో చిత్రీకరించారు.

తెలుగులో షూటింగ్ సోమవారం నాడు ప్రారంభించారు. దీనికి దాసరి నారాయణ రావు క్లాప్ కొట్టగా.. డా. డి. రామానాయుడు స్విచ్ఛాన్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.

అలనాటి జగన్మోహిని చిత్రానికి పనిచేసిన నరసింహరాజు మినహా మిగతా ఎవ్వరూ ఈ చిత్రానికి పనిచేయడం లేదని, ఆయన రాజు పాత్రధారి రాజాకు తండ్రిగా నటిస్తున్నాడని, నమిత తల్లిగా జయమాలినిగా అప్రోచ్ అయ్యామని, ఇంకా ఫైనల్ కాలేదని చిత్ర నిర్మాత మురళి పేర్కొన్నారు. అలనాటి జగన్మోహినిని మోడ్రన్ టెక్నాలజీకి అనుగుణంగా తెరకెక్కిస్తున్నామన్నారు.

సముద్ర గర్భంలో ఉండే జగన్మోహినిని తెరకెక్కించే సన్నివేశాన్ని లండన్ నుంచి వచ్చే సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, అండమాన్‌లో ఆ ఎపిసోడ్‌ను చిత్రించనున్నామని నిర్మాత వివరించారు. 15 రోజులు హైదరాబాద్‌లో, ఆ తర్వాత వైజాగ్, తలకోన, చెన్నై తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపనున్నట్లు తెలిపారు. కోటశ్రీనివాసరావు మాంత్రీకుడిగా నటిస్తున్నారని ఆయన చెప్రారు.

చిత్రదర్శకుడు విశ్వనాథన్ మాట్లాడుతూ.. చాలాకాలం క్రితం "సాహసఘట్టం" అనే చిత్రాన్ని రూపొందించిన తాను మళ్ళీ ఇన్నాళ్ళకు తెలుగులో చిత్రానికి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని, ఈ స్క్రిప్ట్ తనకు చాలా నచ్చి తీస్తున్నానని అన్నారు.

రాజా మాట్లాడుతూ... నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిదేనని, ఇళయరాజా వంటి సీనియర్ టెక్నీషియన్స్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నటుడిగా అన్ని పాత్రలు పోషించాలనే మైథలాజికల్ చిత్రంలో నటిస్తున్నానన్నారు. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రంలో పనిచేయడం ఆనందంగా ఉందని నమిత పేర్కొంది. కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో మోహన్‌బాబు గారి చిత్రంలో మాంత్రీకుడిగా నటించానని, ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు.
About Writer
Selvi