లవ్ ఎంటర్‌టైనర్‌గా నాగబాబు "శుభం"
|
రెండు కుటుంబాల మధ్య జరిగే కథ ఇదని, ఆసక్తికరమైన మలుపులతో, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా మన్ననలు పొందుతోందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే మధుర ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందన్నారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, ఎం.ఎస్. నారాయణ, ఆహుతి ప్రసాద్, కవిత. ఉత్తేజ్, గౌతంరాజు, ప్రీతినగమ్ తదితరులు నటిస్తున్నారు. కథ...మోహన శృతి క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే, మాటలు.. రవి కొలికపూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు... కొండా లక్ష్మయ్య, పోలా శ్రీనివాస్, కట్టా లక్ష్మారెడ్డి.