1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

లండన్‌లో అసిన్!

వినోదం వెండితెర కథనాలు ఘర్షణ అందాల భామ అసిన్ లండన్‌
WD
అమ్మా నాన్నఓ తమిళమ్మాయి, ఘర్షణ, గజినీ వంటి సినిమాల్లో నటించిన అందాల భామ అసిన్ లండన్‌లో పర్యటిస్తోందట. గజినీ హిట్‌తో అవకాశాలు వెల్లువల్లా వస్తున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీబిజీగా ఉంటోంది.

హిందీ గజినీ వెర్షన్‌ షూటింగ్‌లో ఉన్న అసిన్ ఇప్పటికే కొన్ని హాలీవుడ్ ఆఫర్లను కూడా కొట్టేసిందట. ఇంకేముంది... టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌లకే పరిమితం కాకుండా హాలీవుడ్‌‌ రంగాన్ని కూడా ఈ ముద్దుగుమ్మ కుదిపేయనుందన్నమాట.

లండన్ పర్యటనలో ఉన్న అసిన్ 45 రోజుల షూటింగ్‌ను ముగించుకుని తమిళంలో యువహీరో విజయ్ సరసన కొత్త సినిమాలో నటించనుంది. ఇప్పటికే విజయ్-అసిన్ జంట ప్రభుదేవా సినిమా "పోకిరి" (తెలుగులోనూ పోకిరి)లో నటించిన సంగతి తెలిసిందే. సినీ రంగంలో హీరోయిన్‌గా తనకంటూ ఓ ముద్రవేసుకున్న అసిన్... స్నేహ, ప్రియామణి, శ్రియా వంటి కమర్షియల్ హీరోయిన్ల సరసన స్థానం సంపాదించుకుంది.
About Writer
Selvi