గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » విడుదలకు సిద్ధమవుతున్న "రెయిన్‌ బో"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, సింధు మీనన్, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా వి.ఎన్. ఆదిత్య రూపొందిస్తున్న చిత్రం "రెయిన్‌బో". పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు వి.ఎన్. ఆదిత్య తెలిపారు. రెయిన్‌బో మాదిరి ఈ సినిమా కూడా రంగుల హరివిల్లుగా ఉంటుందన్నారు.

యువతరాన్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని వి.ఎన్. ఆదిత్య వెల్లడించారు. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఆనందపు హరివిల్లులో తడిసి ముద్దవుతారని చెప్పారు.

నేపథ్యగాయకుడు నిహాల్ తొలిసారిగా ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని సమకూర్చారని, ఇప్పటికే విడుదలైన ఈ సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆదిత్య తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ సింధు మీనన్ సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లు విఎన్ ఆదిత్య