గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "కలర్స్" స్వాతి కబుర్లు!
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
"స్వాతి" అంటే ఎవరో గుర్తుకు రాకపోవచ్చు. కానీ "కలర్స్" అంటే వెంటనే "కలర్స్" స్వాతి అని గుర్తుకొచ్చేస్తుంది. "డేంజర్" సినిమాతో తెరంగేట్రం చేసి "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రంతో నటిగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇంద్రగటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన "అష్టా-చమ్మా"లో కథానాయికగా నటించింది.

ఇందులో తనకొచ్చిన ఆఫర్ గురించి స్వాతి చెబుతూ... దర్శకులు మోహన్‌గారు తనను కలిసి ఓ విభిన్న పాత్ర ఉంది.. చేస్తావా? అని అడిగారు. పల్లెటూరి అమ్మాయిగా కనిపించే రెండో కథానాయిక రోల్‌లో నటించాలన్నారు.

ఇలాంటి పాత్ర గతంలో "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రంలో చేసినప్పటికీ, మోహన్ లాంటి గొప్ప దర్శకుని చిత్రంలో నటించే అవకాశం వదులుకోకూడదని అంగీకరించాని చెప్పారు.

ఇంతలో ప్రధాన నటీనటుల ఎంపికలో జాప్యం ఏర్పడిందని, ఈ క్రమంలో తనను ప్రధాన పాత్రకు సెలెక్ట్ చేశారని అన్నారు. అందుకనుగుణంగా స్క్రిఫ్ట్‌లో చిన్నమార్పులు చేశారని, దీంతో పట్టణ యువతిగా నటించే అవకాశం లభించిందని చెప్పుకొచ్చారు. పాత్ర పరంగా.. మహేష్ బాబుకు వీరాభిమానినని... ఇంతకంటే ఎక్కువ చెప్పలేను... సినిమా చూడకుండా అంతా రాబట్టేస్తారా!" అంటూ ముగించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు కలర్స్ స్వాతి డేంజర్ తెరంగేట్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అష్టాచమ్మా