1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"హైదరాబాద్ బ్యాచ్‌లర్స్" పాటల రికార్డింగ్

వినోదం వెండితెర కథనాలు లెజండ్స్ క్రియేషన్స్ బేనర్ బిఆర్ ప్రసాద్ నిర్మాణం హైదరాబాద్ బ్యాచ్లర్స్ పాటల రికార్డింగ్
లెజండ్స్ క్రియేషన్స్ బేనర్‌పై బి.ఆర్. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో ఎ.వి.బసవయ్య చౌదరి సమర్పణలో సత్య దర్శకత్వం వహిస్తున్న "హైదరాబాద్ బ్యాచ్‌లర్స్" చిత్రం పాటల రికార్డింగ్ గీతాంజలి స్టూడియోలో జరిగింది. లలిత్ సురేష్ సంగీత దర్శకత్వంలో "ఇది హైదరాబాదురా... బాబు... హై టెన్షన్ బాదురా బాబూ" అన్న పాటను ప్రారంభించారు. ఈ పాటను వెంకట్ రాయగా, ఉష, డా. సుధారాణిలు ఆలపించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ... గత నెల 26న షూటింగ్ ప్రారంభించి మూడు రోజుల పాటు మొదటి షెడ్యూల్స్‌ను పూర్తి చేశామని, తదుపరి షెడ్యూల్ ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ జరుగుతుందన్నారు.

అభిరామ్, శ్యామ్, ధృవ, వందిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం... ఉమ, మాటలు... శ్రీ వెంకట్, నిర్మాత... బి.ఆర్. ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... సత్య.
About Writer
Selvi