డబ్బింగ్‌లో "మెంటల్ కృష్ణ"
|
డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆర్టిస్టులు మెచ్చుకోవడం ముదావహమని, రెండు రోజుల్లో డబ్బింగ్ పూర్తవుతుందని, పూర్తిగా స్టడీకామ్ కెమెరాతో చిత్రించడం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. తెలుగులో ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇలా ఎవ్వరూ తీయలేదని, అక్టోబర్ నెలాఖరులోగానీ, నవంబర్ ప్రథమార్థంలో గానీ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
నాగబాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ జాకీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం... వందేమాతరం శ్రీనివాస్, కెమెరా... గాదిరాజు శ్రీనివాస్, ఎడిటింగ్... మోహన్ రామారావు, ఆర్ట్... బాబ్జీ, కథ, స్క్రీన్‌ప్లే మాటలు, దర్శకత్వం... పోసాని కృష్ణ మురళి.