సంస్కృతుల తేడాను చాటిచెప్పే "కాల్సెంటర్"
|
అన్ని రకాల వృత్తుల్లాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సంస్థల్లో పనిచేసే వారంతా విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారని లోకేష్‌దత్ చెప్పారు. డ్యూటీ నుంచి బయటకు రాగానే మన సంస్కృతికి మారిపోతున్నారు. ఈ రెండు సంస్కృతుల మధ్య ఉన్న తేడాను ఈ చిత్రంలో చూపించామని ఆయన తెలిపారు.
టెక్నికల్‌గా హై వాల్యూస్ ఉన్న చిత్రమిదని లోకేష్ దత్ అన్నారు. తమిళంలో "చెన్నపట్నం"గా దసరాకు విడుదల చేస్తున్నామని, తెలుగులో మాత్రం ఈ నెల 11న విడుదల చేస్తున్నామని తెలియజేశారు. డి.టి.ఎస్. కార్యక్రమాలతో కాస్త ఆలస్యమైనా తొలికాపీ సిద్ధమైందని చెప్పారు. సోమవారం నాడు సెన్సార్ జరుపుకుంటోందని ఆయన వివరించారు.
ఓవర్ సీస్‌లో రెండు రోజులు ఆలస్యంగా విడుదలవుతుందని లోకేష్ దత్ చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత యార్లీ మాట్లాడుతూ... " నా ఊపిరి", "చిన్నోడు" వంటి చిత్రాల తర్వాత మరో మంచి చిత్రంగా "కాల్ సెంటర్" తెరకెక్కనుందని అన్నారు. ఐదుగురు జంటల మధ్య జరిగే కథ ఇదని చెప్పారు.