బాలీవుడ్‌లో హాసినిగా జెనీలియా!
|
తెలుగు, తమిళంలోనే కాకుండా దక్షిణ సినీ రంగాన్ని ఇదే క్యారెక్టర్‌తో కుదిపేసిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ తన హవాను కొనసాగించేందుకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం "జానే తు యా జానే నా" అనే సినిమాలో జెనీలియా లీడ్‌రోల్‌ను పోషిస్తోంది.
ఈ నేపథ్యంలో తెలుగు బ్లాక్ బ్లస్టర్ మూవీ "బొమ్మరిల్లు" హిందీలో రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో జెనీలియా మూడో సారి హాసినిగా నటిస్తోంది. తమిళంలో రీమేక్ అయిన "బొమ్మరిల్లు"లో కూడా జెనీలియా హాసిని పాత్రను పోషించిన సంగతి విదితమే.
ఇంకా చెప్పాలంటే... హాసిని పాత్రకు జెనీలియా చక్కగా అమరిందని, అందుకే హిందీ బొమ్మరిల్లు ("ఇట్ ఈజ్ మై లైఫ్") సినిమాలోనూ ఆమెకే ఆ ఛాన్స్ దక్కిందని సినీ వర్గాల సమాచారం. ఇకపోతే హిందీ "బొమ్మరిల్లు" చిత్రానికి బోని కపూర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.