ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు > తలకోన అడవుల్లో "జగన్మోహిని"!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తలకోన అడవుల్లో "జగన్మోహిని"!
WD
రాజా, నమిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "జగన్మోహిని" సినిమా షూటింగ్ తలకోన అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. గత 1978వ సంవత్సరంలో విట్టలాచార్య దర్శకత్వంలో రూపొందిన "జగన్మోహిని" సినిమాను తెలుగులో ఎన్.కె. విశ్వనాథన్ డైరక్ట్ చేస్తున్నారు. హెచ్.మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దట్టమైన తలకోన అడవుల్లో హీరోయిన్ నమితపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు యూనిట్ వెల్లడించింది. సెప్టెంబర్ మాసాంతంలో వైజాగ్, అండమాన్ నికోబార్ దీవుల్లో "జగన్మోహిని" షూటింగ్ జరుపుకోనుందని, అండమాన్ నికోబార్ దీవుల్లో పతాక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

డిసెంబరులోగా షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి (2009)లోపు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇంకా "జగన్మోహిని" సినిమాలో రాజాకు తండ్రిగా నరసింహరాజు నటిస్తున్నారు. విఠలాచార్య 'జగన్మోహిని'గా నటించిన "జయమాలిని" పాత్రలో నటించే ఛాన్స్‌ను నమిత కొట్టేసింది.

జయమాలినికి ధీటుగా నమిత ఈ పాత్రలో గ్లామరస్‌గా అందాలను ఆరబోస్తుందని సినీ వర్గాల్లో టాక్. ముత్యాలను ఏరుకునే సాగరకన్యగా నమిత ఈ చిత్రంలో కనువిందు చేయనుందని, ముత్యాల వేట కోసం సముద్రగర్భంలో మునిగే సన్నివేశాల్లో అమ్మడు చక్కగా నటించడంతో పాటు, దీనికోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మరోవైపు "జగన్మోహిని"లో రెండో కథానాయికగా "వాన" ఫేం మీరాచోప్రా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. సంగీతానికి పూర్తి ప్రాధాన్యత గల చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి.
మరిన్ని
బాలీవుడ్‌లో హాసినిగా జెనీలియా!
సంస్కృతుల తేడాను చాటిచెప్పే "కాల్‌సెంటర్"
ఆ "థ్రిల్లర్" ఓ విచిత్రం!
డబ్బింగ్‌లో "మెంటల్ కృష్ణ"
"హైదరాబాద్ బ్యాచ్‌లర్స్" పాటల రికార్డింగ్
"కలర్స్" స్వాతి కబుర్లు!