గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ధనవంతురాలిని ప్రేమించిన "మెంటల్ కృష్ణ"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
రిచ్‌గేళ్, పూర్‌బాయ్‌ల ప్రేమ కథలు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. అదేవిధంగా రిచ్‌గేళ్, మిడిల్ క్లాస్ అబ్బాయిల కథలూ చాలా వచ్చాయి. కానీ ఆ అబ్బాయి "మెంటల్‌కృష్ణ"గా పిలువబడే... ఆ ప్రేమ వ్యవహారం ఎంతవరకు సఫలీకృతం అవుతుందనే పాయింట్‌తో "మెంటల్‌కృష్ణ" చిత్రం రూపొందింది.

మోహన్‌వడ్లపట్ల నిర్మించిన ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయి రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రం గురించి మంగళవారం నిర్మాత మాట్లాడుతూ.. ధనవంతురాలి కుమార్తె మధ్యతరగతి అబ్బాయి పెండ్లిచేసుకోవడం తప్పా? అనే విషయాన్నిఈ సినిమాలో చర్చిస్తున్నామన్నారు.

ఇటీవలే ఓ పత్రికలో ఓ న్యూస్ వచ్చిందని, ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయిని ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశారని, ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకమే ఈ చిత్రమని వివరించారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

పోసాని మాట్లాడుతూ... పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, చిత్రాల తరహాలో విభిన్న కథాంశంతో, ఈ సినిమాను స్టడీకామ్ కెమెరాతో చిత్రించామన్నారు. ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసం చేయలేదని, తదుపరి చిత్రంగా "గవర్నమెంట్" చిత్రాన్ని రూపొందిస్తున్నామన్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభిస్తామని, మోహన్‌వడ్లపట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో తాను హీరోయిన్‌గా నటించానని సత్యకృష్ణన్ చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు రిచ్గేళ్ పూర్బాయ్ ప్రేమ కథలు కుప్పలుతెప్పలు