1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

నిర్మాత గోపాల్ రెడ్డి ఇకలేరు!

వినోదం వెండితెర కథనాలు ప్రముఖ నిర్మాత భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల రెడ్డి రక్తపోటు ఇకలేరు మంగమ్మగారి మనుమడు
ప్రముఖ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రక్తపోటుతో బాధపడుతున్న గోపాలరెడ్డి చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు గోపాల్ రెడ్డి పరమపదించారని ఆయన కుటుంబీకులు తెలిపారు.

నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చెందిన గోపాల్ రెడ్డి వ్యవసాయ శాస్త్రంలో బీఎస్పీ చదివారు. సినిమాలంటే మొదటి నుంచి విపరీతమైన ఆసక్తి. ఆ ఉత్సాహంతోనే సినిమా ఫైనాన్షియర్‌గా మద్రాసులో అడుగుపెట్టారు. వ్యాపారం చేస్తూనే 1979లో "చిలిపి చిన్నోడు" అనే అనువాద చిత్రంలో నిర్మాతగా మారారు.

తదనంతరం 1983 నుంచి తెలుగులోనే చిత్రాలు తీయడం ప్రారంభించి, "మనిషికో చరిత్ర" అనే సినిమాకు మొట్టమొదట నిర్మాణ సారథ్యం వహించారు. ఇలా.. తెలుగు, తమిళ సినీ రంగాల్లో హిట్ సాధించిన సినిమాలకు గోపాల రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

తెలుగులో గోపాలరెడ్డి నిర్మాతగా, నందమూరి బాలకృష్ణ నటించిన "మంగమ్మగారి మనుమడు", ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మా పల్లెలో గోపాలుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరించిన సంగతి తెలిసిందే.
About Writer
Selvi