1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

గోపాల్ రెడ్డి మృతికి ఎన్టీఆర్ సంతాపం

వినోదం వెండితెర కథనాలు భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాల్రెడ్డి మృతి ఎన్టీఆర్ సంతాపం
WD
ప్రముఖ నిర్మాత, భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్‌రెడ్డి మృతి పట్ల ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. భార్గవ్ ఆర్ట్స్ బేనర్ అంటేనే నందమూరి అభిమానులు తమ సొంత సంస్థగా భావిస్తారని, గోపాల్‌రెడ్డిగారిని తమ ఫ్యామిలీ మెంబర్‌గా భావిస్తున్నామని ఎన్టీఆర్ అన్నారు.

బాబాయ్ అభిమానిగా భార్గవ్ ఆర్ట్స్ బేనర్‌ని, గోపాల్ రెడ్డిగారిని నేనెంతో అభిమానిస్తున్నాని చెప్పారు. బాబాయ్‌తో మంగమ్మగారి మనుమడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన గోపాల్ రెడ్డిగారు ఇకలేరు అన్న వార్త విని తానెంతో దిగ్భ్రాంతి చెందానన్నారు.

ఆయన లేని లోటు తీర్చలేనిదని, గోపాల్ రెడ్డిగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. గోపాల్ రెడ్డిగారి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
About Writer
Selvi