రంభ "ప్రతిక్షణం" ఏం చేస్తుంది?
|
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ.. తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నానని, ఒక్కరోజులో ఓ అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే ఈ చిత్రకథని అన్నారు. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆ తర్వాత శ్రీలంకలో చిత్రీకరణ ఉంటుందని అన్నారు. తనకు బ్లెడ్ అంటే పడదని, ఈ థ్రిల్లర్ సినిమాలో అవేవీ ఉండవని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ... డైలాగ్స్ పెద్దగా ఉండవని, కొత్త తరహాలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. రక్తపాతం లేని ఓ థ్రిల్లర్ కథ ఇదని, ఒకే రాత్రిలో జరిగే చిత్రమని, హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుందని దర్శకులు చెప్పారు.
ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయని, ముమైత్‌ఖాన్‌పై ప్రత్యేక సాంగ్ ఉందని కూడా ఉందని దర్శకులు అన్నారు. థ్రిల్లర్ సినిమా అయినా అందరినీ అలరిస్తుందని, ఇందులో ప్రకాష్ రాజ్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా రియాజ్ ఖాన్, సంపత్ తదితరలు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా... పన్నీర్ సెల్వం.