1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పాటల చిత్రీకరణలో "సామ్రాజ్యం"

వినోదం వెండితెర కథనాలు విక్రమ్ హీరో ప్రియాంక కొఠారి సమీక్ష శ్రీహరి సుమన్ మాళవిక ప్రధాన పాత్రలు
WD
విక్రమ్ హీరోగా, ప్రియాంక కొఠారి, సమీక్ష హీరోహీరోయిన్లుగా, శ్రీహరి, సుమన్, మాళవిక ప్రధాన పాత్రలుగా నటిస్తోన్న చిత్రం "సామ్రాజ్యం". వీరుద్వైత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ముత్యాల ఆంజనేయులు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

కలువకృష్ణ సాయి రాసిన పాటను ప్రదీప్ అంథోని నృత్యదర్శకత్వంలో ప్రియాంక కొఠారిపై చిత్రిస్తున్నారు. ఎంటీవీ తరహాలో గ్రీన్ మ్యాట్‌లో ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో నడిచే ముక్కోణపు ప్రేమకథలో మానవతా విలువలు, సందేషం అంతర్లీనంగా ఉంటాయని ఆయన అన్నారు.

అక్టోబర్ 12న ఆడియోను నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, సత్యంరాజేష్, గుండు, దండపాణి, కవిత, రక్ష, రేఖ, ఉమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. టి. రాజేంద్ర, సంగీతం... చక్రి, ఎడిటింగ్... రామ్ గోపాల్ రెడ్డి.
About Writer
Selvi