ప్రేక్షకులను ఆకర్షించే నవ్వుతో క్యూట్‌గా నటించి బాలీవుడ్ అగ్రనటిగా ముద్రవేసుకున్న అందాల భామ ప్రీతి జింటా. అల్లరి పాత్రల్లో ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా నటించే ఈ ముద్దుగుమ్మ ఛాలెంజింగ్ పాత్రను పోషించనుందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి.తన అందమైన నవ్వుతో ప్రేక్షకులను అలరించి బాలీవుడ్‌లో ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న జింటా, ప్రస్తుతం చేసే కొత్త రోల్ ద్వారా మంచి గుర్తింపును సాధిస్తుందని బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. " హీరోస్" అనే చిత్రంలో ఈ గ్లామర్ డాల్ ప్రీతి జింటా సీరియస్ పాత్రలో నటిస్తుందని తెలిసింది. బాలీవుడ్ యంగ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఇక కథాపరంగా చెప్పాలంటే... విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ చెరకును ఫ్యాక్టరీలకు తరలించే ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. కొన్ని అనివార్య కారణాల చేత సల్మాన్ మరణిస్తాడు.అనంతరం అతని భార్య అయిన ప్రీతిజింటా తన కుమారునితో సల్మాన్ మరణానికి గల కారణాలేమిటో? తెలుసుకుని, వాటిని ఎదిరించి పోరాటం చేస్తుందని దర్శకుడు సమీర్ కార్నిక్ వెల్లడించారు. ఈ పాత్ర ద్వారా ప్రీతిజింటాకు మంచి గుర్తింపు లభించడం తథ్యమని కార్నిక్ తెలిపారు.బాలీవుడ్ "బబ్లీ బేబీ"గా ఇమేజ్ ఉన్న ప్రీతి జింటా... "హీరోస్"లో ప్రదర్శించే రోల్ ద్వారా ప్రేక్షకుల మన్ననలను పొందుతుందని సమీర్ చెప్పారు. బాడీ లాంగ్వేజ్‌కు తగిన ఈ పాత్రలో ప్రీతి జింటా అద్భుతంగా నటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|