1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

7,8 పచ్చిమిరపకాయలు తినేశా: బింధుమాధవి

వినోదం వెండితెర కథనాలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తినేశా ఐశ్వర్యారాయ్ గొప్ప అభిమానిని హమ్ దిల్ దిచుకే హై సనమ్
"నేను ఐశ్వర్యారాయ్ గొప్ప అభిమానినని", ఆమె "హమ్ దిల్ దిచుకే హై సనమ్" చిత్రంలో నటించేటప్పుడు సహజత్వం కోసం ఓ సన్నివేశంలో పచ్చిమిరపకాయలు తిన్నదని విన్నాను. ఆ సంఘటన తనను ప్రభావితం చేసిందని అంటోంది ఆవకాయ్ బిర్యానీ హీరోయిన్ బింధుమాధవి.

ఇదే విధంగా ఆవకాయ్‌లోనూ సహజత్వం కోసం తానూ ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తినేశానని గొప్పగా చెబుకుంటోంది ఈ అందాల ముద్దుగుమ్మ బింధు.

ఏడ్చే సన్నివేశంలో గ్లిజరిన్ ఉపయోగించమని దర్శకుడు చెప్పారని, కానీ తాను ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తినేశానని ఈ భామ వెల్లడించింది. కాకపోతే... మంటెత్తి ఓ గంట సేపు బాధపడ్డానని తేలికగా అంటోంది. అంతేకాదు అందుబాటులో పంచదార కూడా లేదు అని బింధు గొప్పగా చెబుతోంది.

తన కళ్ళు పెద్దవిగా బాగుంటాయంటారని.. అసలు హావభావాలు పలికించడంలో కళ్లే తనకు చాలా సహకరించాయని బింధు పేర్కొంటుంది. అందమైన సొట్ట బుగ్గలు ఉన్నందుకు కూడా గర్వంగా ఉందని... అయితే అందరినీ నమ్మటమే తన బలహీనమని వరుసగా తన గురించి చెప్పుకొచ్చింది... ఈ ఆవకాయ్ అమ్మే అమ్మాయి. అంతేకాదు.... "ఆవకాయ్ బిర్యానీ"తో టాలీవుడ్‌లో మెరిసిన తెలుగు తారను తానేనని ధీమాగా అంటోంది కూడా...!

ఇకపోతే... శేఖర్ కమ్ముల శిష్యుడు అనీష్ కురువిల్లా "ఆవకాయ్ బిర్యానీ"కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మోడల్‌గా ర్యాంపులపై క్లాస్‌గా తొలి అడుగేసినా... ఓ పల్లెటూరి అమ్మాయిగా మాస్ పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్మించిన "ఆవకాయ్ బిర్యానీ"లో ఆమెకు ఛాన్స్ దొరికిందంటే.. ఇంకేమీ చెప్పనవసరం లేదుగా మరీ...!
About Writer
SELVI.M