1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"గజల్ శ్రీనివాస్‌"ను వరించిన గిన్నిస్ రికార్డు

వినోదం వెండితెర కథనాలు గజల్ శ్రీనివాస్ గిన్నిస్ రికార్డు గాంధీజీ తత్త్వం ఒకే స్వరం
ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను గిన్నిస్ రికార్డు వరించింది. గాంధీజీ తత్త్వంపై ఏకంగా 100 భాషల్లో పాటలు పాడిన శ్రీనివాస్ ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు గురువారం శ్రీనివాస్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఓ సందేశం పంపింది.

జాతిపిత మహాత్మా గాంధీకి వినూత్న రీతిలో నివాళులర్పించే దిశగా గజల్ శ్రీనివాస్ ఓ పాటను వంద భాషల్లో ఆలపించే సాహసకృత్యానికి విజయవాడ వేదికైంది. బాపూజీ సిద్ధాంతాలపై తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 56 భారతీయ భాషల్లోనూ, 44 విదేశీ భాషల్లోనూ అదే గేయాన్ని, అదే స్వరంతో గానం చేసే యజ్ఞాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రికార్డు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా పంపారు.

సుమారు ఐదు నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం తీవ్రంగా కృషి చేసిన గజల్ ఒక్కొక్క భాషలో ప్రముఖులైన గేయ రచయితల చేత ఈ గేయాన్ని రాయించుకుని ఆ భాషకు గల సహజత్వం కోల్పోకుండా, అర్థం మారకుండా, అన్నింటిని ఒకే స్వరంలో పాడిన ఘనత శ్రీనివాస్‌ది.
About Writer
SELVI.M