"సన్రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్"చే కొత్త చిత్రానికి శ్రీకారం
WD
సర్దార్ పటేల్, సురేష్, మహేష్, విను, వివేక్, ప్రవీణ్, దినేష్, గౌతమ్ ముఖ్య పాత్రలుగా.. రాజ్, కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ నిర్మిస్తోన్న తొలి చిత్రం షూటింగ్ ప్రసాద్ ఐమాక్స్‌లో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు షాట్‌కు హీరో వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, మరో హీరో గోపిచంద్ స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో దర్శకుడు గోపి మాట్లాడుతూ.. ప్రారంభం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రముంటుందన్నారు. ఇందులో 8 మంది హీరోలు, ఒక హీరోయిన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. హీరోహీరోయిన్లుగా కొత్తవారినే పరిచయం చేయడమే ఈ చిత్ర విశేషమని దర్శకుడు వెల్లడించారు.
నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ... విభిన్నమైన కథాంశానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి ప్రేక్షకులకు అందిస్తున్నామని, త్వరలో పాటల రికార్డింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. గణ అనే నూతన సంగీతదర్శకుడిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామన్నారు.
టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ చిత్రాలకు దర్శకుడు గోపి పనిచేశారని, టెర్రరిజంపై ఆయన రూపొందించిన "లివ్ అండ్ లెట్‌లివ్"కు మూడు నంది అవార్డులను అందుకున్నారని నిర్మాత తెలిపారు. 15 రోజుల్లో షూటింగ్‌ను ప్రారంభిస్తామని, సింగిల్ షెడ్యూల్‌తోనే చిత్ర నిర్మాణం పూర్తవుతుందని రాజశేఖర్ వెల్లడించారు.
సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి కెమేరా... రమణ తోట, ఎడిటింగ్.. రాజగోపాల్, ఆర్ట్... రామ్ గోపి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... రాజ్‌కె. ఎస్.గోపి.