రాజీవ్ కనకాల హీరోగా, ప్రభుదేవా సోదరుడు నాగేంద్రప్రసాద్, విజయసామ్రాట్ ప్రధాన పాత్రల్లో, సింధు తులానీ, సుహాసిని హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "పాయిజన్". అనూప్ చక్రవర్తి సమర్పణలో జోషిక సాయిలక్ష్మీ ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఫణిరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
డి. రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సెక్సీతార ముమైత్ ఖాన్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయనుందని నిర్మాత చెప్పారు. ఒక పాట మినహా షూటింగ్ అంతా పూర్తయిందని, ఆ ఒక్క పాటను ముమైత్ ఖాన్‌పై రామోజీ ఫిల్మ్ సిటీలో వేసే పబ్ సెట్‌లో, నిక్సన్ నృత్యదర్శకత్వంలో జనవరి 12 నుంచి చిత్రీకరించనున్నామని రమేష్ బాబు చెప్పారు.
ఈ స్పెషల్ సాంగ్‌లోనే కాక ముమైత్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రను కూడా పోషించారని నిర్మాత చెప్పారు. ముమైత్ ఖాన్ పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, సబ్జెక్ట్ పరంగా, టేకింగ్ పరంగా సినిమా చాలా అద్భుతంగా వస్తోందని, ఇప్పటికే డబ్బింగ్ పూర్తయిందని నిర్మాత వివరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
రాజీవ్ కనకాల, నాగేంద్ర ప్రసాద్ (ప్రభుదేవా సోదరుడు), విజయ్ సామ్రాట్, సింధు తులానీ, సుహాసిని, ముమైత్ ఖాన్, ధర్మవరపు, సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, ఏవీఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు.. రామస్వామి, సంగీతం... చంద్రలేఖ, ఫోటోగ్రోఫీ... పి.ఎస్. వంశీకృష్ణ.