1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" ఆడియో రిలీజ్

వినోదం వెండితెర కథనాలు నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ ఆడియో రిలీజ్ శివాజీ కావేరీఝా బ్రహ్మానందం కామెడీ విలన్ నాగేంద్రకుమార్
శివాజీ, కావేరీఝా జంటగా బ్రహ్మానందం కామెడీ విలన్‌గా నటిస్తోన్న "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్" చిత్ర పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. శనివారం ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూథియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆడియో కేసెట్‌ను విడుదలచేసి నిర్మాత అమ్మిరాజుకు అందించారు. అనంతరం సీడీని అల్లరి నరేష్ ఆవిష్కరించి చిత్ర హీరో శివాజీకి అందజేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... మైక్‌టైనస్ అనే పాత్రను ఈ చిత్రంలో పోషించానని, ఇది నిజంగా వైవిధ్యమైనదని చెప్పారు. తనపై ఒకపాట కూడా చిత్రీకరించారని, మంత్ర ఆనంద్ చక్కని ట్యూన్స్ సమకూర్చారని పేర్కొన్నారు.

ఆనంద్ స్పందిస్తూ... మంత్ర, ఇందుమతి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు పనిచేసి వెంటనే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం సాహసమే అయినా... కొద్దిగా కష్టపడ్డానని, బ్రహ్మానందం సాంగ్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందన్నారు. చీమలా నిరంతరం కష్టపడుతూ.. చిన్న పాత్రల నుంచి హీరోస్థాయికి ఎదిగిన శివాజీని ఆనంద్ ఈ సందర్భంగా అభినందించారు.

శివాజీ మాట్లాడుతూ... క్రేన్ ఆపరేటర్ అయిన నిర్మాతలు తనతో సినిమా తీయడానికి వస్తే ముందు అంగీకరించలేదని, కానీ కథ వినమని చెప్పాక.. బాగుండి ఒప్పేసుకున్నానని తెలిపారు. ఈ నిర్మాతలు బాగా రిచ్‌గా ఎదగాలని శివాజీ ఆకాంక్షించారు.

చిత్ర దర్శకుడు ఎం. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ... ఒక్కపాట హిట్ అయినా సినిమాకు ప్లస్ అవుతుందని, ఇందులో 5 పాటలన్నాయని, ఆనంద్ చక్కని మ్యూజిక్ అందించారని చెప్పారు. బ్రహ్మానందం కామెడీ విలన్‌గా నటించడం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని నాగేంద్రకుమార్ వెల్లడించారు.

యుటీవీ న్యూ మీడియా, మధుర ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఆడియోను మార్కెట్ చేస్తోంది. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు విజయసాయి, ఎడిటర్ ఉపేంద్ర, కెమెరామెన్ మారో, మధుర లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
About Writer
SELVI.M