1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

వాళ్లిద్దరూ నన్ను విడిచిపెట్టరు: మినిష్షా లాంబ

బాలీవుడ్ మినిష్షా లాంబ దీపికా పదుకునే ఇండస్ట్రీ మగస్నేహితులు
IFM
బాలీవుడ్ నటీమణుల మధ్య పోటీ ఎప్పటికప్పుడు మహా రంజుగా ఉంటుంది. ఒక్కో చిత్రం ఒక్కొక్కరికి ఒక్కోరకమైన బ్రేక్ తెస్తుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ పరిశ్రమలో అడుగుపెట్టిన మరో అందాల సుందరి మినిష్షా లాంబ. తన వ్యక్తిగత సంగతులు చెప్పమన్నప్పుడు... ఆమె ఇలా చెప్పుకొచ్చింది...

" దీపికా పదుకునే నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇండస్ట్రీలో నాకు చాలామంది స్నేహితులున్నారనుకోండి. మగస్నేహితులు కూడా (నవ్వుతూ). ముఖ్యంగా రణబీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్‌లు నన్ను వదిలిపెట్టరు. మేము మాటల్లో పడ్డామంటే సమయం తెలియదు. అంతగా లీనమై పోతాం.

ఈ సినీ పరిశ్రమలో నేను తెలుసుకున్నదేమిటంటే... కష్టపడి పనిచేస్తే కానీ అనుకున్నది సాధించలేం. అలాకాక ఏదో చేసేస్తున్నాం అని గనుక ప్రవర్తిస్తే... ప్రేక్షకులు తగిన రీతిలో స్పందిస్తారు. సో... అప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్లక తప్పదు. పైగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉంది. దీనిని తట్టుకుని నిలబడాలంటే వళ్లు వంచి పనిచేయాల్సిందే. అందుకే నా మటుకు నేను దర్శకుడు ఏది చెపితే అది తు.చ తప్పక పాటిస్తున్నా" అని చెప్పింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT