1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మహాభారతంపై అమీర్ ఖాన్ కన్ను..!

వినోదం వెండితెర కథనాలు మహాభారతం అమీర్ ఖాన్ కన్ను గజనీ కృష్ణుడు అర్జునుడు కర్ణుడు
WD
"గజనీ" చిత్రం విజయంతో కాస్త విశ్రాంతి తీసుకున్న అమీర్ ఖాన్‌ను ఇటీవలే మీడియా కలిసింది. ఈ సందర్భంగా అమీర్ మీడియాతో మాట్లాడుతూ... తాను మహాభారత్ సినిమా చేపట్టున్నట్లు వెల్లడించారు. మహాభారత కథ తన హృదయానికి దగ్గరగా ఉందన్నారు. ఇటువంటి భారీ ప్రాజెక్టు చేయాలంటే.. ఎంతో సమయం పడుతుందని చెప్పారు.

ఇది ఎంతో సాహసంతో కూడుకున్నదని, మొదట ఇందులో కర్ణుడు, అర్జునుడు పాత్రలు వేయాలనుకున్నానని, కానీ కాస్త పొట్టివాడిని కాబట్టి ఆ పాత్రలకు తగనని విరమించుకున్నానని అమీర్ వెల్లడించారు. అన్ని విధాలా తనకు సరిపోయే పాత్ర కృష్ణుడు గనుక ఆ పాత్రే వేయాలనుకున్నానని అమీర్ చెప్పారు. మరి చిత్ర వివరాలను త్వరలో వెల్లడిస్తానని గజనీ హీరో తెలిపారు.
About Writer
SELVI.M