1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

"ఫిటింగ్ మాస్టర్‌"ను ఆదరించండి: ఇ.వి.వి

వినోదం వెండితెర కథనాలు ఫిటింగ్ మాస్టర్ ఇవివి అల్లరి నరేష్ సంక్రాంతి కలెక్షన్లు విశాఖ ఎక్స్ప్రెస్ గమ్యం ఆమె
WD
అల్లరి నరేష్ నటించిన "ఫిటింగ్ మాస్టర్" సంక్రాంతినాడు విడుదలైంది. ఇప్పటికి ఆరు రోజులు దాటినా కలెక్షన్లు బాగున్నాయని చిత్ర దర్శకుడు ఇ.వి.వి. సత్యవారాయణ అన్నారు. కొన్నిచోట్ల నూన్ షో మినహా మిగిలిన ఆటలు హౌస్‌ఫుల్ అవుతున్నాయని ఇ.వి.వి చెప్పారు. శ్రీకాకుళం, వైజాగ్ జిల్లాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఇ.వి.వి మాట్లాడుతూ... "ఆమె" తర్వాత అటువంటి చక్కని కథతో చిత్రాన్ని తీశానని అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు. గతంలో సంక్రాంతినాడే "ప్రేమఖైదీ" విడుదలైందని, ఆ చిత్రమంతటి విజయాన్ని ఈ సినిమా చవిచూస్తుందని ఇ.వి.వి. ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చిత్రాన్ని నాలుగు జిల్లాల్లో పంపిణీ చేసిన అంబికా కృష్ణ మాట్లాడుతూ.. మనకిచ్చిన ఆప్యాయతలను మన తల్లిదండ్రులకు తిరిగి ఎందుకు ఇవ్వలేకపోతున్నామనేది నేటి యువత మర్చిపోతుందని చెప్పారు. ఇదే ఆప్యాయతలు వారి పిల్లలపై చూపించాలి కదా? అదంతా మరిచి రెండు మనస్సుల కలయికగా పెళ్లకి అర్థం చెబుతున్నారు. పెళ్లి అంటే రెండు కుటుంబాలకు కలయిక అని తెలుసుకోవాలని అంబికా కృష్ణ సూచించారు. ఏదో సినిమా తీశామనేది కాకుండా చక్కని కథతో ఆలోచించే విధంగా ఫిటింగ్ మాస్టర్ ఉన్నాడని అంబికా కృష్ణ వెల్లడించారు.

నరేష్ మాట్లాడుతూ.. గత ఏడాది బాగా కలిసొచ్చిందని, ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతిరోజు వస్తున్న ఫిటింగ్ మాస్టర్ రిలీజ్‌కు టెన్షన్ పడ్డానని చెప్పారు. తన నుంచి కామెడీయే కాదు.. సీరియస్‌ను కూడా రిసీవ్ చేసుకుంటారని ఫిటింగ్ మాస్టర్ నిరూపించాడని తెలిపారు. మంచి గుర్తింపు గల పాత్రను "గమ్యం"లో పోషించానని, ఆ తర్వాత "విశాఖ ఎక్స్‌ప్రెస్" చేశానని, ఇక మూడో చిత్రంగా చేసిన ఫిటింగ్ మాస్టర్‌ను అందరూ ఆదరిస్తారని నరేష్ ఆశించారు.
About Writer
SELVI.M