గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » రొమాంటిక్ కామెడీ మూవీగా "నువ్వే నా సఖి"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD
"ప్రేమిస్తే" ఫేమ్ సంధ్య హీరోయిన్‌గా నటి సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "నువ్వే నా సఖి". ఈ సినిమాకు "ఫిక్సయిపోయాను" అనే ట్యాగ్ కూడా జోడించారు. కన్మణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి. భరణి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీని పూర్తి చేసుకుంది. షూటింగ్ కూడా ముగింపు దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి పాటను శుక్రవారం గోల్కొండఫోర్ట్‌, రామోజీ ఫిలింసిటిలో చిత్రీకరిస్తారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14న ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నామని దర్శకుడు వెల్లడించారు. చక్కని ప్రేమకథా చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నామని కణ్మణి చెప్పారు.

హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ.. రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రంలో కాలేజీ చదివే అమ్మాయిగా కన్పించబోతున్నానని చెప్పింది.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా... అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. తంజై శరవణన్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు రొమాంటిక్ కామెడీ మూవీ నువ్వే నా సఖి ప్రేమిస్తే సంధ్య సంగీత సోదరుడు పరిమళ్ కన్మణి వి భరణి