1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

తొలిషెడ్యూల్ పూర్తయిన "తేజం"

వినోదం వెండితెర కథనాలు సన్రేస్ ఎంటర్టైన్మెంట్స్ తొలిషెడ్యూల్ తేజం రాజ్కెఎస్గోపి తేజం సినిమాకామ్
సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, రాజ్.కె.ఎస్.గోపి దర్శకుడిగా రాజశేఖర్ నిర్మిస్తోన్న "తేజం" తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ను నేటి (ఫిబ్రవరి-2) నుంచి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర వివరాలను తెలియజేస్తూ.. తేజం సినిమా.కామ్‌ను తమ్మారెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకు పనిచేస్తున్న యువకులంతా సినిమా పరిశ్రమలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారేనని చెప్పారు. వీరందరి తొలి ప్రయత్నమే విజయవంతం కావాలని తమ్మారెడ్డి ఆశించారు.

చిత్ర దర్శకుడు గోపి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 35 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు. త్వరలో ఆడియోను విడుదల చేస్తామని, నేటి యువతకు తగిన కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా గణ అనే సంగీత దర్శకుడు పరిచయమవుతున్నారని వెల్లడించారు. చక్కని కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మరో దర్శకుడు నరేంద్రకుమార్ తెలిపారు. ఈ మధ్య కాలంలో విజయవంతమైన హ్యాపీడేస్, కొత్తబంగారులోకం తరహాలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని, వీరి ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో సర్దార్ పటేల్, సురేష్, మహేష్, రాజ్, వివేక్, వినోద్, గౌతమ్, జయవర్ధన్, మోనీష, రామకృష్ణ, సత్య, ప్రవీణ్ తదితరులు నటిస్తున్నారు. కెమేరా.. రమణ తోట, సంగీతం..గణ, పాటలు.. జొన్నవిత్తుల, శివ, శిరీష్, రాఖేష్ ఖన్నా, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... రాజ్ కె.ఎస్. గోపి.
About Writer
SELVI.M