1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

చిరంజీవి, బాలయ్యలు చేసిందేమిటి..?

వినోదం వెండితెర కథనాలు చిరంజీవి బాలయ్య సామాజిక న్యాయం చిన్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నట్టికుమార్
సామాజిక న్యాయమంటూ.. రాజకీయాల్లోకి వెళ్ళాక హీరోలంతా మాట్లాడడం బాగానే ఉందని, కానీ ఎన్నో సంవత్సరాలుగా హీరోలుగా ఉండి... ఇండస్ట్రీకి వారు చేసింది ఏమిటని? చిన్న నిర్మాతలు కొందరు సోమవారం ప్రశ్నించారు.

రెండు నెలల క్రితం చిన్న నిర్మాతలంతా థియేటర్లలో పర్సెంటీ సిస్టమ్, టాక్స్ మినహాయింపు ఇవ్వాలని నిరాహారదీక్ష చేశారు. అనంతరం ఫిలిమ్‌ఛాంబర్ వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. కానీ రెండు నెలలు గడిచినా తమ హామీలను నెరవేర్చలేదని చిన్న నిర్మాతల ఎగ్జిక్యూటివ్ సభ్యుడు నట్టికుమార్ వాపోయారు.

సినీ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఇంకా కొంతమంది నటులు గ్రామసేవకులను ఆదుకుంటామని, బీడీ కార్మికులను ఆదుకుంటామని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారేగానీ, ఒక్కరైనా తెలుగు చలనచిత్రం అభివృద్ధిని గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.

ముఖ్యంగా సురేష్ అధినేత సురేష్, ఏషియన్ ఫిలింస్ అధినేత సునీల్ చేతుల్లోనే దాదాపు 300 థియేటర్లు ఉన్నాయని, వారంతా చిన్న చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం లేదని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 27లోగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని లేదంటే.. వారింటిముందే ఆమరణనిరాహార దీక్ష చేపడతామని చిన్న నిర్మాతలు హెచ్చరించారు.
About Writer
SELVI.M