గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » ప్రభాస్ హీరోగా "డార్లింగ్"
కథనాలు
Feedback Print Bookmark and Share
 
WD

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా "ఛత్రపతి" వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై మళ్ళీ ప్రభాస్ హీరోగా కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి "డార్లింగ్" అని పేరు పెట్టారు.

"తొలిప్రేమ", "ఉల్లాసంగా ఉత్సాహంగా" వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.

ఈ చిత్రం గురించి నిర్మాత "ఛత్రపతి" ప్రసాద్ మాట్లాడుతూ.. ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో తమ పతాకంపై నిర్మిస్తున్న మరోభారీ చిత్రం "డార్లింగ్" అన్నారు. కరుణాకరన్ చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుందని, ప్రభాస్ కెరీర్‌లో ఇది ఓ డిఫరెంట్ కమర్షియల్ ఫిలిమ్ అవుతుందని చెప్పారు. మార్చిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి ఏప్రిల్ నుంచి షూటింగ్ చేస్తామని వెల్లడించారు.

దర్శకుడు ఎ. కరుణాకరన్ మాట్లాడుతూ.. డార్లింగ్ సబ్జెక్ట్ ప్రభాస్‌ని దృష్టిలో పెట్టుకుని చేసిన మంచి లవ్‌స్టోరీ అని, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు తగినట్లుగా వుంటూనే... మంచి లవ్ ఫీల్‌తో తెరకెక్కనుందని చెప్పారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ విని ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారని, "తొలిప్రేమ" తర్వాత తనకు అన్ని విధాలా సంతృప్తిని కలిగించే చిత్రంగా "డార్లింగ్" రూపొందుతోందని కరుణాకరన్ వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి నిర్మాత... బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎ. కరుణాకరన్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర కథనాలు ప్రభాస్ హీరో డార్లింగ్ ఛత్రపతి కరుణాకరన్ తొలిప్రేమ బివిఎస్ఎన్ప్రసాద్ ఎకరుణాకరన్