గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » విడాకులు తీసుకున్న వేణుమాధవ్
కథనాలు
Feedback Print Bookmark and Share
 
Venumadhav
WDWD
హాస్యనటుడు వేణుమాధవ్ తన భార్యనుంచి విడాకులు తీసుకున్నారు. గత కొద్దికాలంగా గొడవలతో కాపురం చేసిన వేణుమాధవ్ దంపతులు తాజాగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం విశేషం.

దంపతులిరువురు పరస్పరం అంగీకారం తెల్పడంతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సోమవారం విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న సందర్భంగా భరణం కింద తన భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు మైనర్ పిల్లలకు రూ. 60లక్షలు ఇచ్చేందుకు వేణుమాధవ్ అంగీకరించారు.

కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన సాంప్రదాయం చిత్రం ద్వారా హాస్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన వేణుమాధవ్ కొద్దికాలానికే బిజీ నటుడిగా మారిన సంగతి తెలిసిందే. హాస్యనటుడిగా కొనసాగుతూనే రెండు మూడు చిత్రాల్లో వేణుమాధవ్ హీరోగా కూడా నటించారు. అనంతరం నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని కూడా నిర్మించారు.

ఇదేసమయంలో తనను హింసిస్తున్నారని వేణుమాధవ్‌పై ఆయన భార్య కేసు పెట్టినట్టు కొద్ది నెలల క్రితం వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా వేణుమాధవ్ విడాకులు తీసుకోవడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: భార్య విడాకులు వేణుమాధవ్ హాస్యనటుడు రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ