మలేషియాలో "రాజు మహారాజు"
డాక్టర్ మోహన్ బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా, "గమ్యం" ఫేమ్ శర్వానంద్, శుర్విన్ చావ్లా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రాజు మహారాజు". భాను శంకర్ దర్శకత్వంలో, శ్రీ కుమార స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం "రాజు మహారాజు" మలేషియా వెళ్లాడని సినీ యూనిట్ తెలిపింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామన్నారు. శర్వానంద్, మరో హీరోయిన్ తనుక్ కౌశిక్‌లపై ఓ పాటను తదుపరి షెడ్యూల్‌లో ఆస్ట్రేలియాలో చిత్రీకరించనున్నామని చెప్పారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నామని తెలిపారు.
బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, నాజర్, ఎం.ఎస్. నారాయణ, సురేఖా వాణి, భారత్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం.. చక్రి, కెమేరా.. రమేష్ బాబు.