పూనెలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఊహాచిత్రం రూపొందిందని దర్శకునిగా పరిచయమవుతున్న సత్య తెలియజేశారు. వంశీకృష్ణ, కావేరీఝా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పైడిబాబు నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగంగా.. డీటీఎస్ కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి.
శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. రచయిత వచ్చి దర్శకుడిగా మారానన్నారు. కథలో కొత్తదనం సినిమాటిక్‌గా మార్చామని, ఊహకందని ట్విస్ట్‌లతో ఊహాచిత్రముంటుందని చెప్పారు. సాహిత్యపరంగా సంగీతపరంగా సినిమా హైలైట్ అవుతుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత పైడిబాబు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులో తొలికాపీ సిద్ధమవుతోందని, మే రెండో వారంలో సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. యూత్ సినిమా కాబట్టి వేసవి సెలవుల వరకు ఆగామని, రొమాంటిక్‌థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామని ఆయన వివరించారు. కథపై ఉన్న నమ్మకంతో కొత్తవారితో ఈ చిత్రాన్ని రూపుదిద్దామని వెల్లడించారు.
ఇంకా ఈ సినిమాకు సంగీతం.. శివ ఆర్. నందిగామ్, కెమెరా.. వి.ఎన్. సురేష్ కుమార్.