Puri's son in International movie | పూరీ తనయుడితో "లోటస్ పాండ్"
|
ఈ సినిమా గురించి సంస్థ ఎం.డి. మాట్లాడుతూ.. పది సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పాఠశాల విద్యార్థులు 14000 అడుగుల ఎత్తులో ఉన్న లోటస్‌పాండ్‌లోకి వెళ్ళి విహరించాలనుకుంటారు. అంత ఎత్తుకు ఆ విద్యార్థులు ఎలా చేరుకున్నారన్నదే ఈ చిత్ర కథాంశమన్నారు.
ఇందులో చిరుత, బుజ్జిగాడు చిత్రాల్లో చిన్నప్పటి హీరోగా నటించిన పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరో బాలనటుడు రోహిత్ కూడా నటిస్తున్నాడని త్రిపాదయా ఎం.డి వివరించారు.
జూన్‌లో షూటింగ్ పూర్తవుతుందని, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కులువి భాషల్లో ఒకేసారి విడుదల చేసి మిగిలిన భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని త్రిపాదయా ఇన్నేవేషన్ మార్కెటింగ్ లిమిటెడ్ ఎం.డి. తెలియజేశారు.