Fruit Salad| Cinema| Shooting| G. Srinivas| Siya Gowtham| Sowmya | "ఫ్రూట్ సలాడ్" షూటింగ్ ప్రారంభం
|
ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు ముగ్గురు హీరోలు తనీష్, నిఖిల్, సందీప్‌లు క్లాప్ కొట్టగా, తారకరత్న, సి. కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం షూటింగ్ సింగిల్‌షెడ్యూల్లో పూర్తిచేస్తామని నిర్మాత ఇనగడప సతీష్‌కుమార్ తెలిపారు. ప్రేమికులకు చక్కని సందేశం కూడా ఇందులో ఉందన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ప్రేమకు పండుకు దగ్గరి సంబంధముంది. పండులో తియ్యదనం ఉన్నట్లే ప్రేమలో కూడా తియ్యదనం ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి ఫ్రూట్ సలాడ్ అనే పేరు పెట్టామని చెప్పారు. ఏడు కథల్ని మేళవించి రూపొందిస్తున్న చిత్రమిదని తెలిపారు.
తాను లైఫ్‌స్టైల్ అనే చిత్రంలో నటించానని, ఫ్రూట్ సలాడ్ చిత్రంలోని తన పాత్ర తనకు మంచి గుర్తింపు సంపాదించి పెడుతుందని జి. శ్రీనివాస్ తెలిపారు. పూరీజగన్నాథ్ చిత్రంలో చేసిన తాను తెలుగులో ద్వితీయ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని శియ గౌతమ్ చెప్పారు.