Allu Arjun| GunaSekar| Danayya| DesaMuduru| Bunny| Suhasini | నాలుగో షెడ్యూల్‌లో "అల్లు అర్జున్" కొత్త చిత్రం
|
యూనివర్శల్ మీడియా పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని నాలుగో షెడ్యూల్‌తో ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు షూటింగ్ జరుపుతామని నిర్మాత వెల్లడించారు.
అల్లు అర్జున్-గుణశేఖర్ కాంబినేషన్‌లో అద్భుతమైన సబ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తమ బేనర్‌లో ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
"దేశముదురు" తర్వాత బన్నితో నిర్మిస్తున్న మరో సూపర్‌హిట్ చిత్రమిదని దానయ్య వెల్లడించారు. అత్యున్నత సాంకేతిక విలువలతో గుణశేఖర్ అద్భుత టేకింగ్‌తో ఈ చిత్రం నిర్మాణమవుతోందని దానయ్య తెలిపారు.
ఇకపోతే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఓ కొత్త కథానాయికను పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం.
సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్‌ప్రసాద్‌లతో పాటు మరికొందరు ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: ఆంథోని, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.