1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Audio

Magadheera| Audio| Chirutha| RamCharan Teja| Kajal Agarwal | జూన్ 28న "మగధీర" ఆడియో విడుదల

మగధీర
WD
తొలిచిత్రం "చిరుత"తోనే కలెక్షన్స్‌లో రికార్డ్ సృష్టించిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం "మగధీర".

వరుసగా ఆరు సూపర్ హిట్స్ ఇచ్చి డబుల్ హ్యాట్రిక్ సాధించిన సూపర్ సక్సెస్‌ఫుల్ డైరక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకోనున్న మగధీర సినిమా ఆడియోను జూన్ 28న విడుదల చేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. జూలైలో విడుదలయ్యే ఈ భారీ చిత్రంలో కథానాయికగా కాజల్ నటిస్తుండగా, శ్రీహరి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

సునీల్, బ్రహ్మానందం, దేవ్‌గిల్, శ్రావణ్, సమీర్, సుబ్బరాయశర్మ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ: వి. విజయేంద్రప్రసాద్, మాటలు: ఎం. రత్నం, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఫోటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్: రమా రాజమౌళి, ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. యోగానంద్, నిర్వహణ: బాబు, కో-ప్రొడ్యూసర్: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.
About Writer
SELVI.M