దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నడుంనొప్పితో బంజారహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం రాత్రి వెంగమాంబ సంగీతస్పందన కార్యక్రమానికి రాఘవేంద్రరావు హాజరుకావాల్సి ఉంది. అదే రోజు మధ్యాహ్నం ఆయనకు తీవ్రంగా నడుంనొప్పి రావడంతో ఆయన మేనేజర్ సహకారంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం రాఘవేంద్రరావు ఆరోగ్యంగానే ఉన్నారనీ ఆయన సన్నిహితులు చెప్పారు. ఫిబ్రవరిలో ఆయన మూత్రకోశవ్యాధితో కొద్దిరోజులు చికిత్స నిమిత్తం ఇదే ఆసుపత్రిలో చేరారు.
ఇకపోతే.. రాఘవేంద్రరావు సిద్దార్థ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే రాఘవేంద్రరావుస మేనల్లుడు, అల్లుడు కలిసి మరో రెండు చిత్రాలను రాజమౌళి, రాధాకృష్ణ (క్రిష్)లతో నిర్మిస్తున్నారు.